Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-యాదాద్రి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌ను అధిక మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా ఆయనకు తన కార్యకర్తలతో బీర్ల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ యుఐ నేతత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. అధినేత్రి సోనియా గాంధీ, అధినాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వెంకట్ బల్మూర్‌ను హుజురాబాద్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాల్ రాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ గౌడ్, భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మెన్‌్ బర్రె జహంగీర్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మంగ ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, జాతీయ నాయకులు కల్వకుంట్ల వరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం...
హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్‌కు టికెట్ ఖరారు తర్వాత తొలిసారిగా హుజురాబాద్ నియోజకవర్గానికి వెళుతూ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనార్థం యాదగిరిగుట్ట వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఆశీర్వచనం చేశారు. పట్టణంలోని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం బీర్ల తన కార్యకర్తలతో ఘనంగా సన్మానించారు