Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
తెలంగాణ రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20 లక్షల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తామన్న సీఎం కేసీఆర్ నేటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులకు అమలు చేసిన జీవోలనే యధావిధిగా కొనసాగిస్తూ కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టారన్నారు. కార్మికులకు పనికి తగ్గ వేతనాలు, ఉద్యోగ భద్రత అవుట్ సోర్సింగ్ రద్దు, ఆ రోగ్యాల విషయంలో ఎలాంటి భరోసా కల్పించకపోవడం దారుణమన్నారు. సీఐటీయూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8న చేపట్టిన సమ్మెకు ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, నాయకులు పులి చింతల వెంకట్‌రెడ్డి, వట్టెపు సైదులు, పల్లా వెంకట్‌రెడ్డి, దుగ్గి బ్రహ్మం, మురళి, జె.వెంకటేశ్వర్లు పి.హుస్సేన్, వెంకటచంద్ర, వీరస్వామి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.