Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
ఈ నెల 9న కేవీపీఎస్ ఆధ్వర్యంలో హైదరా బాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మెన్లను నియమించాలని, దళితబందును రాష్ట్రమంతా వర్తింపజేయాలని, అర్హులైన వారందరికీ కార్పొరేషన్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండలాధ్యక్షుడు దొరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గుర్రంయేసు,కొండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొదమగుండ్ల నాగేష్, మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, కొదాటి సైదులు, మచ్చ గురుమూర్తి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.