Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్ పహాడ్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమ య్యాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, మండల కార్యదర్శి రణపంగ కృష్ణ విమర్శించారు. మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గురువారం అయితబోయిన సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ గ్రామశాఖ మహాసభలో వారు మాట్లాడారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులకు పడుతున్నా ప్రభుత్వాలు ఏ మాత్రమూ స్పందించలేదన్నారు. దీనికి తోడు ధరల మీద ధరలు పెంచుతుండడంతో సామాన్యులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సంవత్సరం నుంచి రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి తోడు వారిపై లాఠీఛార్జిలు, కాల్పులకు పాల్పడడం దారుణమన్నారు. అనంతరం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా అయితబోయిన సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, అయితబోయిన వెంకన్న, నాగలి మట్టయ్య, ధనియాకుల లక్ష్మమ్మ, శ్రీను, తారమ్మ, భిక్షం, నరసయ్య, సత్యం, వెంకన్న, లచ్చయ్య, లచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.