Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
గాంధీ జయంతి ఈ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం నిర్వహించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 421 గ్రామ పంచాయతీలలో 7424 రోడ్లను శుభ్రం పరిచినట్టు తెలిపారు. ఎలాంటి రోగాలు రాకుండా 4772 మురుగు కాల్వలను శుభ్రం చేసినట్టు తెలిపారు. గ్రామాలలో ఇష్టానుసారంగా చెత్త రోడ్లపై వేయకుండా 39 డస్ట్ బిన్ ములను అమర్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాలలో 1593.32 కిలోగ్రాముల ప్లాస్టిక్ ను సేకరించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎస్బిఎం సంబంధించి 96 గ్రామాలలో వాల్ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. భూగర్భ జలాల మట్టం పెరగడం పై ప్రజలకు వివరించినట్టు తెలిపారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించుట కు అవగాహన కల్పించి పర్యావరణ రక్షణ కోసం అందరూ సహకరించాలని కోరినట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ నెల 9 వరకు అన్ని గ్రామ పంచాయతీలో నిర్వహించనున్నట్టు తెలిపారు.