Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మఠంపల్లి
మండలంలోని వివిధ గ్రామా లకు చెందిన రైతులు వివిధ కారణాలతో చని పోయి నెలలు గడుస్తున్నా వారికి రైతు బీమా అందలేదని, వెంటనే రైతుబీమా వర్తింపజేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం వ్యవసాయాధికారి బుంగ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా పాండు నాయక్ మాట్లాడుతూ చనిపోయిన రైతులకు వారం రోజుల్లో రైతు బీమా డబ్బులు చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్, రన్మియా, రామచంద్రు రామకోటి తదితరులు ఉన్నారు.