Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-గుండాల
మోడీ సర్కార్ దేశసంపదను కార్పొరేట్టకు కట్టబెట్టాలని చూస్తున్నాడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీన్ అన్నారు. మండలంలోని గంగాపురం గ్రామంలో ఆ పార్టీ మండల మహాసభలు పింగిలి విజరు రెడ్డి అధ్యక్షతన శాఖాపురం కొండయ్య ప్రాంగణంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్ జెండా ఆవిష్కరించి,అమరులకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రజాసంపదను లూటీ చేయాలని చూస్తోందన్నారు. గ్యాస్,పెట్రోల్,డీజిల్,నిత్యావసర సరుకుల ధరలు పెంపుతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. కరోనా సమయంలో సహాయం పేరుతో ప్రభుత్వం తెచ్చిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేద ప్రజలకు అందిన సహాయం శూన్యం అన్నారు. మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు రైల్వే స్టేషన్,విమానయాన, ఓడరేవులు,బొగ్గు గనులు,ఖనిజాలు, పోస్టల్,32 లక్షల కోట్ల రూపాయల సంపద గల ఎల్ఐసి సంస్థలను ప్రయివేటు కార్పొరేట్ లకు కట్టబెట్టాలని,ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెట్టి 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాలనే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం వుందన్నారు. శాంతియుతంగా రైతు పోరాటాలు చేస్తున్న రైతులపై నుండి ఉత్తరప్రదేశ్ మంత్రి కొడుకు కారు వెళ్లడంతో 8 మంది రైతులు మరణించారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,మండల కార్యదర్శి మద్దెపురం రాజు, సీఐటీయూ మండల కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ నాయకులు అంజయ్య, వజీర్, సురేష్, బాలయ్య, ఖలీల్, భిక్షం, యాకన్న, సుదర్శన్, నర్సయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.