Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ - సూర్యాపేట
నేడు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఒక్క రోజు టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. గురువారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఫసియుద్దీన్‌కు సమ్మె నోటీసు అందజేసి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ వాళ్లకు లాభాలు తెచ్చేందుకు నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు రూ.21 వేలకు తగ్గకుండా నిర్ణయించాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు జీవోలను వెంటనే గెజిట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య, హమాలీ కార్మికులు రమేష్, శ్రీను, దసురు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.