Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కొసరు నిధులతో బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు గురువారం గవర్నర్ తమిళసైసౌందరరాజన్ కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ వెళ్తూ స్థానిక వివే రా హాటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం పూర్తి చేసిన బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు ఏడేండ్ల కాలలయాపన చేస్తూ కేవలం రూ.50 0 కోట్లు కేటాయిస్తే లక్ష ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే నాకు పేరు వస్తుందన్న అక్కసుతో పూర్తి చేయడం లేదని ధ్వజమెత్తారు. తాను బతికున్నంత వరకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేయరని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఎంజీ యూనివర్సిటీని టీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. కాలేజీకి ఎక్కువగా యూనివర్సిటీకి తక్కువగా ఎంజీ యూనివర్సిటీ దిగజారిందన్నారు. ఈ విషయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. కోమటిరెడ్డికి పేరొస్తుందనే ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారన్నారు..ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ప్రభుత్వం డెడ్ లైన్లు ఎప్పుడో దాటిపోయాయి సీఎం సొంత నియోజకవర్గంలో సర్పంచుల రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం సీఎంకు సిగ్గుచేటన్నారు. నల్లగొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని ఏం అభివద్ధి చేశారు చెప్పాలని ప్రశ్నించారు రహదారులపై గుంతలు పడి ప్రమాదకరంగా ఏర్పడి కొంత మంది ప్రాణాలు మరికొంతమంది అంగ వికలాంగులుగా మారిపోయారనిఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని రహదారిపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చారని చెప్పారు.దళితులకు 3 ఎకరాల భూ భూమి భూమి ఇస్తానని తాను ఏనాడు చెప్పలేదని అసెంబ్లీలో పేర్కొనడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ ఎన్నికలు పూర్తయిన తర్వాత దళితబంధు కూడా తాను రాష్రమంతటా అమలు చేస్తానని అని చెప్పలేదని మాట మార్చడం ఖాయమన్నారు నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తానని చెప్పి నేటికి ఏడేండ్ల నుండి కాలయాపన చేస్తున్నారని తాను చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ కాదన్నారు.ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్, నార్కట్‌పల్లి మండల అధ్యక్షులు బత్తులఉషయ్యగౌడ్ ,చిట్యాల మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జిల్లా నాయకులు పన్నాల రాఘవరెడ్డి, గార్లపాటి రవీందర్‌రెడ్డి , పాశం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కొంపెల్లి సైదులు, ఎంపీటీసీ వనం చంద్రశేఖర్, ఎల్లారెడ్డిగూడెం ఉపసర్పంచ్ వడ్డే భూపాల్‌రెడ్డి, చిట్యాల మండల వైస్ ప్రెసిడెంట్ పాల శివకుమార్, ఎలికట్టె గ్రామశాఖ అధ్యక్షులు పెరిక శంకరయ్య, నీలకంఠం లింగస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ శాఖ పెద్దకపర్తి జంపాల వెంకన్న, 11 వ వార్డ్ కౌన్సిలర్ పద్మ జలంధర్‌రెడ్డి, ఎలికట్టె మాజీ ఎంపీటీసీ పోలగాని సత్తయ్య, ఎలికట్టె వార్డు సభ్యులు ఉయ్యాల పెంటయ్య, యూసుఫ్, పందిరిసతీష్ పాల్గొన్నారు.