Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
పట్టణంలోని తిప్పర్తి రోడ్డు వెంట గల దళితుల శ్మశానవాటికను వారికే చెందాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దైద సుందరయ్య ఫౌండేషన్ చైర్మెన్ దైదా రవీందర్ మాట్లాడుతూ కొంతమంది అక్రమంగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకొని బోర్డు పాతడం జరిగిందన్నారు. తాతల కాలం నుండి వస్తున్నా శ్మశానవాటిక స్థానిక దళితులకే చెందాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో దళిత సంఘాల ప్రతినిధులు వంటెపాక అంబేద్కర్, గుండ్లపల్లి యాదగిరి, గోసుకోండ రమేష్, మార్షల్, పాలడుగు నరేష్, వెంకటేష్ ,పందిరి సతీష్,మధు ఉన్నారు.