Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్5 పురస్కరించుకొని ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సంస్థ వారు జాతీయస్థాయిలో 40 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసేవారు.అందులో భాగంగా గురువారం సికింద్రాబాద్ లో జరిగిన సన్మానం మహోత్సవ కార్యక్రమంలో మండలపరిధిలోని కొత్తగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆదిమల్ల మణిరాజును క్లీన్ హోం-గ్రీన్హోం కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నందుకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందజేశారు.ఈ అవార్డును సికింద్రాబాద్లోని వారి కేంద్ర కార్యాలయం అమతవాణిలో ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలచారి, హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.ఏఐసీఎఫ్ వ్యవస్థాపకులు గద్దపాటి విజయరాజు, కొత్తపల్లి గిదియొన్బాబు, గోపాలమీనన్, పమ్మి డానియల్, సుప్రీంకోర్టు న్యాయవాది జన్నుప్రసంగి, కష్ణప్రసాద్, ఏజ్ సామేల్ పాల్గొన్నారు.