Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కొంత కాలం నుండి వైద్యులు, ఆస్పత్రుల మీద భౌతికదాడులు అధికమయ్యాయని, వెంటనే దాడులను అరికట్టాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గవర్నర్ తమిళిసైసౌందరరాజన్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ చికిత్స చేసే సమయంలో ప్రతి సమస్యకు డాక్టర్లపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా విపరీతంగా దాడులు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందన్నారు.పటిష్టమైన చట్టం దాడులు చేసే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని గవర్నర్ను కొరారు.అర్హత లేని జాతీయ మెడికల్ కమిషన్ ధ్రువ పత్రం లేకుండా వైద్య సేవలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వైదాధికారులు, రెవెన్యూ, పోలీస్ వారు వీరిపై నిఘా ఉంచి చర్యలు తీసు కోవాలనారు.ప్రాచీన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదంను తప్పకుండ అభివద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో సేవలు చేసిన వారికి ప్రత్యేక సదుపాయాలు, ఆర్ధికలాభాలు, అతి తక్కువవడ్డీతో రుణాలు, ఉన్నతవిద్యలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ పీవీఎన్.మూర్తి, డాక్టర్ జయప్రకాశ్ ఉన్నారు.