Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఇటీవల రాష్ట్రంలో చిన్నారులు, వద్ధులు, మహిళలపై ఘోరమైన అఘాయిత్యాలు పట్టపగలే జరుగుతున్నాయని,వీటికి కారణమైన మద్యాన్ని నియంత్రించి, బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆధ్వర్యంలో గవర్నర్ తమిళసైసౌందరరాజన్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ, చైత్రను మొదలుకుని 58 ఏండ్ల ధనలక్ష్మీ వరకు లైంగికదాడులు జరిపి అతిదారుణంగా హత్యలు చేశారని విమర్శించారు. 2020లో నేరాల సంఖ్య 1,35,885 వేధింపులు, 533 అత్యాచారాలు, 785 కేసులు నమోదయ్యాయన్నారు.నిపుణుల నివేదిక ప్రకారం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం మద్యమేనన్నారు.ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తుం దన్నారు.మద్యం, బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా పెంచుతుందన్నారు.గ్రామీణప్రాంతాల్లో బెల్ట్‌షాపులు బార్లను తలపిస్తున్నాయన్నారు.ఏటీఎం లాగా ఎనీటైమ్ మద్యం దొరుకు తుందన్నారు.దీనికి తోడు గంజాయి, డ్రగ్స్, అక్రమ రవాణా జరిగే యువత పెడదారి పడుతూ మైకంలో నేరాలకు పాల్పడుతున్నారన్నారు.అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల సినిమాలు, ఫోర్న్వీడియోలపై నియంత్రణ లేదన్నారు. స్త్రీలపై హింస పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయన్నారు. ఒంటరి స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.లైంగికదాడితో పాటు హత్యకు గురైన వారి కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చట్టం చేయాలని కోరారు.పట్టణాలతో పాటు గ్రామాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సినిమాలు, సీరియల్స్లలో అశ్లీలత, హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మీ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మలపద్మ, పట్టణ అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి ఉన్నారు.