Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలో కలుషిత నీరు వస్తుందని, మున్సిపల్ పాలకవర్గం పరిశుభ్రమైన నీరందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం పార్టీ పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో మంచినీరు కలుషితంగా వస్తున్నాయని విమర్శించారు.రోడ్లన్ని గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ఉపాధి కోసం పట్టణానికి వలసొచ్చి 20 ఏండ్లుగా అద్దెఇండ్లలో నివాసముంటూ ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.నల్లగొండ పట్టణంలో పూర్తిచేసిన 550 ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం, దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి, తుమ్మల పద్మ, అద్దంకి నర్సింహ, దండెంపల్లి సరోజ, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, గాదె నర్సింహ, పోలె సత్యనారాయణ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, గుండాల నరేష్,మారగోని నగేష్ పాల్గొన్నారు.