Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పెరిగిన సాంకేతికతో నేరాలకు అడ్డుకట్ట
అ ఎస్ఐ భీమన బోయిన యాదయ్య
నవతెలంగాణ -నార్కట్పల్లి
మొబైల్ ఫోన్ పోయిందని ఓ విద్యార్థి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేవలం రెండు గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యను ఎస్ఐ భీమనబోయిన యాదయ్య ఛేదించి ఆ విద్యార్థికి ఫోన్ అందజేశారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ...బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమన బోయిన రేణుక సికింద్రాబాద్లో ఎంబీఏ చదువుకుంటుంది. ఆదివారం తన బంధువుల ఇంటికి నార్కట్ పల్లికి సోదరుని ద్యి చక్ర వాహనంపై వస్తుండగా బ్యాగ్లో నుంచి కింద పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రేణుక గ్రామంలో వెతికింది. ఎంత ప్రయత్నించినప్పటికీ మొబైల్ దొరక్కపోవడంతో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఎండి.తన్వీర్ సహకారంతో నార్కట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. తన మొబైల్లో తన ఎంబీఏ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయని తన భవిష్యత్తు మొబైల్ తో ఆధారపడి ఉందని ఎస్ఐ కు వివరించగా వెంటనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొబైల్ ఉన్న పరిసర ప్రాంతాల ను లొకేషన్ ద్వారా గుర్తించారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి ఆ ప్రాంతంలో వేతకడం తో సమస్యను ఛేదించారు. విద్యార్థిని పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో నేరాలను అదుపు చేయడం చాలా తేలిక అన్నారు. సెల్ ఫోన్లు దొంగలించిన వారు పోలీసుల నుంచి తప్పించుకోలేరన్నారు. సమస్య పట్ల వెంటనే స్పందించడం అందరికీ న్యాయం జరిగే విధంగా కషి చేయడం పోలీసుల బాధ్యత అన్నారు.