Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్గొండ
మానసిక వైద్యానికి అవగాహన కల్పించాలని ఐఎంఏ నీలగిరి అధ్యక్షుడు ఎన్విఎన్.మూర్తి అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ నీలగిరి నల్లగొండ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ఐఎంఏ జరుపు కుంటున్నదని ,అందరు మానసిక వైద్యానికి ప్రాముఖ్యం ఇచ్చి అందరికి అవగాహనా కల్పించాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిత రాణి మాట్లాడుతూ విశ్వక్ రెడ్డి ఎన్నో క్లిష్టమైన మానసిక రోగులకు ఉత్తమ్ వైద్యం అందించి వారిని మామూలు మనుషులను చేసారని కొనియాడారు. మానసిక వైద్యులు విశ్వక్ రెడ్డి మాట్లాడుతూ మానసికంగా ధడంగా వున్న వారు ఏ రంగం లో వున్నా ఈ అసమానతలకు ప్రాముఖ్యం ఇవ్వ కుండా నిబద్దతతో వుంటారన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పుల్లా రావు, డాక్టర్ శతి డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.