Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , టీఆర్ఎస్ పై, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు చేయడం సరికాదని జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు ప్రతిపక్షా ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ప్రాంత అభివద్ధి కావడం లేదని, కేవలం అభివద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరమని అన్నారు. తమను ఎవరు కూడా భయబ్రాంతులకు గురిచేసి టీిఆర్ఎస్లోకి చేర్చుకున్నారనే ఆరోపణలో నిజం లేదని అన్నారు.ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రాంతం అభివద్ధి కోసం తప్పనిసరిగా టీఆర్ఎస్లో చేరామన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో , మండల అద్దక్షులు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణ బుతరాజు దశరథ, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్ రెడ్డి, అన్నేపర్తి శేఖర్, కొడి వెంకన్న, కొంరెడ్డి యాదయ్య, నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి, ఎంపీటీసీ గోరిగే సత్తయ్య, కట్టా బిక్షం, సతీష్, వెంకన్న, పల్లె శ్రీను, శేఖర్, పందుల బిక్షం పాల్గొన్నారు.