Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
మండలంలోని అర్హులందరికీ డబుల ్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కడెం లింగయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన వాగ్దానం మేరకు నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.ప్రతిగ్రామంలో వందలాదిమంది ఇంటిస్థలాలు , ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగాయన్నారు.ఇనుము, కలప, సిమెంట్ ధరలు, మేస్త్రీ, కూలీల ఖర్చుల కూడా విపరీతంగా పెరిగాయన్నారు.ఇంటిస్థలం ఉన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.ఇంటిస్థలం లేని వారికి ఇంటిస్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ కార్యదర్శి ఎన్.యాకయ్య, మండలసెక్రెటరీ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్షులు పి.సత్తయ్య, ఉపాధ్యక్షులు పి.నగేష్ పాల్గొన్నారు.