Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కార్మికులకు అండ సీఐటీయూ జెండా అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ అన్నారు.ఆదివారం పట్టణంలోని సుందరయ్యభవన్లో నిర్వహి ంచిన మార్బుల్ యూనియన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.పట్టణంలోని వివిధ మార్బుల్ దుకాణాలలో పని చేస్తున్న కార్మికులకు రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు.కార్మికులను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని, 55 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా పందుల కష్ణ,పాలే శ్రీను, ఉపాధ్యక్షులుగా ఉప్పతల విశ్వనాధం, సహాయ కార్యదర్శులుగా బాలాజీ, కోశాధికారిగా లక్ష్మయ్య ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, దాసరి శ్రీనివాస్, బాలాజీ, నవీన్,లు పాల్గొన్నారు.