Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని చందుపట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల 1987-88 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చందుపట్ల గ్రామంలో ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరై... ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తీపిగుర్తులు నెమరువేసుకున్నారు. ఇకపై ఏటా రెండు పర్యాయాలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈసందర్భంగా రావి శ్రీనివాస్ రెడ్డి పదివేలు, మాజీ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి పదివేలు, ,సోలిపురం శంకర్ రెడ్డి ఐదు వేలు, కొంపర్తి బాలచారి ఐదు వేలు, తిమ్మాపూరం బిక్షపతి ఐదు వేలతో పాటు సిహెచ్ సునిత తనవంతు కషిగా పాఠశాలలో జరిగే అభివద్ధి పనుల్లో పాలుపంచుకుంటానన్నీ హమీ ఇచ్చారు. కార్యక్రమానికి సంకోజు బాస్కార్ ప్రధానోపాధ్యాయులు, నేతత్వం వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నం పాండు, ఎంపిటిసి కొండల్ రెడ్డి, విధ్యార్థులు, కష్ణావేణి, పుష్పలత, అంజనేయులు, బాలయ్య, బాలనర్సింహ్మ, భాస్కర్, బిక్షపతి, చంద్రారెడ్డి, కిషన్, కొండల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.