Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
మండలంలోని దుబ్బాక గ్రామంలో రోడ్డు వెంట ఇంటర్నెట్ కేబుల్ కోసం తవ్విన గుంతలను పూడ్చి వేయాలని దుబ్బాక సీపీిఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, గ్రామ శాఖ కార్యదర్శి, ఉపసర్పంచ్ గుండాల భిక్షం మాట్లాడుతూ రామన్నపేట నుండి అమ్మనబోలు వరకు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రోడ్ మార్గంలో ఇంటర్నెట్ కేబుల్ కోసం గుంతలను తొవ్వి కేబుల్ వేసి పూడ్చడం మరిచారన్నారు. రాత్రి పూట వాహనదారులకు చాల ఇబ్బందిగా ఉన్నదని, పలుమార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి మేడి మధుబాబు, వార్డు సభ్యులు గట్టు గోపయ్య, సీనియర్ నాయకులు గట్టు నర్సింహ, మారగోని నర్సింహ, కంభాలపల్లి మత్స్యగిరి, గట్టు మహేష్, జ్యోతిబసు, పి.మత్స్యగిరి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.