Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే ఆసరా పింఛన్ల ప్రక్రియని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ అన్నారు.ఆదివారం మండలకేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా చెప్తున్న కొత్త ఆసరా పింఛన్లకు అతీగతీ లేదన్నారు.65 ఏండ్లు దాటిన వాళ్లకి కూడా పెన్షన్ రావడం లేదన్నారు.ఉపఎన్నికలు రాగానే 57 ఏండ్లు నిండిన వారికి కూడా పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం దేనికి నిదర్శనమన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకొచ్చినప్పటి నుంచి కొత్తగా వితంతు, వద్ధాప్య ,వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుమలప్రగడ కిషన్‌రావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్ముజోహార్, పొన్నాలసజన్, ఎన్ఎస్యూఐ నాయకులు కొండరాజు, అబ్దుల్, హుస్సేన్ ,అనిల్ ,మరికంటి రాయుడు, వెలిశాల మహేష్, పోగుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.