Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవ తెలంగాణ నార్కట్‌పల్లి
గ్రామాలభివద్ధే లక్ష్యంగా టీిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఏనుగులదోరి , నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో , మాధవఎడవల్లిలో బతుకమ్మ చీరలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కట్‌పల్లి వద్ధికి ప్రత్యేకంగా కషి చేయనున్నట్టు తెలిపారు.మండలంలోని ఏనుగులదొరిలో రూ.5 లక్షలు, ఎడవెళ్లిలో రూ.5 లక్షలు, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో రూ.8 లక్షలతో నిర్మించనున్న పలు అభివద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మండలానికి చెందిన 30మందికి సీఎంసహాయనిధి కింద మంజూరైన రూ.19లక్షల చెక్కులను పంపిణీచేశారు. పట్టణకేంద్రంలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చెర్వుగట్టు దేవాలయ చైర్మెన్ మేకల అరుణా రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మహేశ్వరం సతీష్, దూదిమెట్ల స్రవంతి, సామ నరేందర్ రెడ్డి, ఎంపీటీసీిలు ముత్తయ్య శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక పావని శ్రీధర్ ఏ పీ ఎం కష్ణ,, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అశోక్‌రెడ్డి మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.