Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో ప్రజల నుండి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ఒకసారి ఒక సమస్య పై ఫిర్యాదు చేస్తే మళ్లీ అదే సమస్య పై ఆ వ్యక్తి ఫిర్యాదు చేయకూడదని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 50 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఎఓ నాగేశ్వర చారి, అధికారులు పాల్గొన్నారు.
అనంతారంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మండలంలోని అనంతారం గ్రామంలో కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామం లోని డంప్ యార్డ్ , శ్మశాన వాటిక ను సందర్శించారు . ఈ సందర్భంగా కలెక్టర్ అభివద్ధి పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పరిశుభ్రత ను సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శిలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీడీి శ్యామల , సర్పంచ్ చిందం మల్లిఖార్జున్, ఉప సర్పంచ్ విట్టల్ వెంకటేష్, టెక్నికల్ అసిస్టెంట్నాగరాజు పాల్గొన్నారు.