Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకీడు
మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌క్లబ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గోపాల్ మాట్లాడుతూ మారుమూల ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. నాయబ్ తహసీల్దార్ కిషోర్‌బాబు మాట్లాడుతూ సమాజంలో అధికారుల దృష్టికి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి నాగలక్ష్మి, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అనంత ప్రకాష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మాట్టేశ్, ఎంపీటీసీ మీసాల ఉపేందర్, మాజీ సర్పంచులు బాల్‌రెడ్డి, రాఘవరెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు కొనకంచి సైదులు, ఆర్ఐ జానీపాషా, ఎంపీవో దయాకర్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మంద నాగయ్య, జాన్‌రెడ్డి, ఇరుకు సైదులు, యేసు రత్నం, వడ్డే సైదయ్య తదితరులు పాల్గొన్నారు.