Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
ఉపాధి పనుల్లో పారదర్శకంగా పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో 2018 సెప్టెంబర్ 1నుండి 2021 జులై 31వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై 12వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన పనుల వద్ద పని వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులు చేపట్టే సమయములో రికార్డులను పరిశీలించి అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. మండలంలో మొత్తం 29 పంచాయతీలు ఉండగా అందులో 20 పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో తేడాలు రావడంతో పంచాయతీ కార్యదర్శలకు రూ.69 వేలా 917 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీవీవో చరణ్ గౌతమ్, పీఈ ఎమ్‌డి.ఫయాజ్, ఎంపీడీవో కె.ప్రమోద్ కుమార్, ఏపీవో శ్రీనయ్య, ఎస్ఆర్సీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ అల్లం శ్రీనివాస్, ఎంపీటీసీ భాస్కర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.