Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ - సూర్యాపేట
'నేను పని చేసే ప్రతి చోటూ నా జన్మ స్థలంగానే భావిస్తా ను' అని సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు గౌరవ వందనంతో సూర్యాపేట జిల్లా పోలీసు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు సేవలం దించే అవకాశం తనకు రావడం గొప్ప విషయమన్నారు. అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ శాఖ పక్షాన ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తాన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగుతానన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలు, దురాచారాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఫిర్యాదు దారుర్నీ సంతోష పర్చే విధంగా సిబ్బంది పని చేయాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నెలకొల్పిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రఘు, రవి, సీఐలు ఆంజనేయులు, శ్రీనివాస్, విఠల్‌రెడ్డి, రాజేష్, నర్సింహారావు, ఆంజనేయులు, రామలింగారెడ్డి, శివరాంరెడ్డి, నర్సింహ, శివశంకర్, ఆర్ఐలు శ్రీనివాస్, గోవిందరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు