Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరు రూరల్:మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన చింతకింది మమత ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు బుధవారం ఆమె కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి పరామర్శించారు. 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు జాలపు మధుసూదన్‌రెడ్డి, నాయకులు మురళి, రోశయ్య, వెంకటేష్, నాగరాజు, అమృత్ తదితరులు పాల్గొన్నారు.