Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు
భువనగిరి:జిల్లా వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హత కలిగిన పేదలందరికీ పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తహసీల్దార్ శ్యాం సుందర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలం ఉన్న వారికి రూ.6 లక్షల వరకూ ఇవ్వాలన్నారు. ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఏడున్నరేండ్లు కావస్తున్నా నేటి వరకూ ఇవ్వలేదన్నారు. జిల్లా, మండలంలో ఏ ఒక్కరికీ కూడా ఇల్లు ఇవ్వలేదని, ఫలితంగా పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొంతమందికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తున్న పరిస్థితుల్లో యాదాద్రి జిల్లాలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంప స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా, వ్యకాస మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల నాయకులు ఎర్ర మహేష్, రాంపల్లి చంద్రయ్య, పెంటయ్య, యాదగిరి, ఎల్లయ్య, కృష్ణ, అశోక్, కిషన్, పరమేష్, మైసయ్య పాల్గొన్నారు.