Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - రామన్నపేట
మండలంలోని వెల్లంకి గ్రామంలో ఈడేం స్వరూప మెమోరియల్ ట్రస్టు ద్వారా ఈడేం శ్రీనివాస్ - రాధ దంపతులు అందిస్తున్న సేవలు అభినంద నీయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో ఈడేం స్వరూప మెమోరియల్ ట్రస్టు ద్వారా గ్రామపంచాయతీ సిబ్బందికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతులమీదుగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రం చేసే కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. గ్రామాభివద్ధికి ట్రస్ట్ చైర్మెన్ ఈడెం శ్రీనివాస్ ముందుకు రావడం ఆయన విశాల హృదయానికి నిదర్శనమన్నారు. వెల్లంకి గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి దసరా కానుకగా గ్రామపంచాయతీ కార్మికులు ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ నర్సింహా, ఉప సర్పంచ్ రవ్వఅనసూర్య, వార్డు సభ్యురాలు జయలక్ష్మి, ఈడేం రాధా శ్రీనివాస్ దంపతులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదరురెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, అవనగంటి మహేష్, ఎడ్ల నరేందర్‌రెడ్డి, కర్రె రమేష్, ఎడ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.