Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పొట్టపెంజర సైదులు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నాయకులు పొట్ట పెంజర సైదులు మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగార్జున్‌రెడ్డి బుధవారం సైదులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేరెడ్డి చంద్రయ్య, ఆరె బిక్షంరెడ్డిలతో కలిసి ఈ ప్రాంతంలో పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై సైదులు ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇండ్లు ఇప్పించడంలో ఆయన నిర్వహించిన పాత్ర కీలకమన్నారు. గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట్‌రెడ్డి, కోట గోపి, మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, మండల కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ సీనియర్ నాయకులు జహీకొద్దీన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.