Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామపంచాయతీ నర్సరీలలో మొక్కల సేగ్రిగేట్, మట్టి సేకరణ, భూమి చదును చేయడం, పాలిథీన్ సంచుల కొనుగోలు, ప్రైమరీ బెడ్లు చేయుట ఈనెల18 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి సహాయక పథక సంచాలకులు, మండలపరిషత్ అభివద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి నర్సరీల పురోగతి, బహత్ పల్లె ప్రకతివనాలు, పల్లె ప్రకతివనాల పురోగతి, ఈజీఎస్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయితీలలో నర్సరీలకు అంచనాలు ఈ నెల14వ తేదీ లోగా పూర్తిచేయాలని ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలను ఆదేశించారు.అన్ని గ్రామపంచాయితీ నర్సరీలకు గేటు,ఫెన్సింగ్, ఇతరత్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈనెల20 లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయ తీలలో నర్సరీలకు సీడ్ కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బహత్ పల్లె ప్రకతివనాలు, పల్లె ప్రకతివనాలకు సంబంధించిన అన్ని చెల్లింపులు 20 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.బహత్ పల్లె ప్రకతివనాలు,పల్లె ప్రకతివనాలకు అవసరమైన వనసేవక్లను నియమించి వారి పేర్లు, ఫోన్ నెంబర్లను బోర్డులపై రాయించి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామపంచాయితీలో 30 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు.మండలాలలో పెండింగులో ఉన్న సీసీచార్జీలు 50శాతం తగ్గకుండా చెల్లింపులు ఈ నెల14 లోగా చేయాలని తెలిపారు.సస్పెండెడ్, రిజెక్టెడ్ పేమెంట్స్ వెంట వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈవీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ,డీఆర్డీఓ పీడీ కాళిందిని, .జెడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.