Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తేవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాప్తి చెందుతుందని దీనిద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వెలుగులోకి తెచ్చి పరిష్కారం కోసం పాటుపడాలన్నారు.గ్రామ,వార్డు స్థాయిలో ఉద్యమాలను విస్తతంగా ప్రచారం చేయాలని సూచించారు.పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌మీడియాను వేదికగా మార్చుకోవాలన్నారు.కేంద్ర ప్రభుత్వం అవలం బిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాలన్నారు. సోషల్ మీడియా ఇన్చార్జి పిట్టల రవి మాట్లాడుతూ సోషల్‌మీడియా రాజకీయాలను శాసిస్తున్నాయని చెప్పారు.అన్ని పార్టీలు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నాయని, ప్రజా ఉద్యమాలు చేసే కమ్యూనిస్టు భావజాలం సైతం ఉచితంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.గ్రామ వార్డు సభ్యులు కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు.సోషల్ మోడీ రాష్ట్ర కన్వీనర్ ఎండి అంజాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా గైడెర్ పాలడుగు నాగార్జున, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు,నూకల జగదీష్‌చంద్ర, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, మాజీ కౌన్సిలర్ భావండ్లపాండు, వేములపల్లి వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థన పాల్గొన్నారు.