Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో గురువారం సద్దుల బతుకమ్మ పండగ ఉత్సవాలు మహిళలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే వాకిళ్ళముందు రంగురంగుల ముగ్గులు పరిచి సుందరంగా ముస్తాబు చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. ఒకచోట పెట్టి మహిళలు పాటలు పాడుతూ చప్పట్లతో చుట్టూ తిరిగారు . సంతోషిమాత దేవాలయం, శ్రీ కనకదుర్గ ఆలయం ,రంగనాయక దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, శివాలయం ,చింతలబస్తీ, కాటమయ్య నగర్ ,ద్వారకానగర్ ,ఆదర్శనగర్ ,బీసీ కాలనీ ,సాయి గూడెం బహదూర్పేట లలో మహిళలు సామూహికంగా బతుకమ్మలను ఆడారు . ఆలేరు పెద్దవాగులో ప్రవహిస్తున్న నీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్థానిక ఎస్ఐ ఎండీ ఇంద్రేశ్ అలీ పోలీస్ సిబ్బందితోి బందోబస్తు చర్యలు చేపట్టారు. శ్రీ కనకదుర్గ ఆలయం ఆవరణలో ప్రేమ సేవాసదన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడిన మహిళలకు వాయినం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు .