Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉద్దీపన చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజలే దేవుళ్ళు... ప్రజలే సర్వస్వం ఓపిక, ఓర్పు, సహనంతో బాధ్యతాయుతంగా సామాన్య ప్రజలకు సేవ చేయాలని, తాను అందరిలో ఒక్కడిగా ఉంటానని ఉద్దీపన చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టీిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆ పార్టీ జిల్లా నాయకులు, బెస్ట్ సేవా సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పూస బాలకిషన్ జన్మదినాన్ని మండల కేంద్రంలోని జేపీ గార్డెన్ లో కార్యకర్తలు, నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, పూస బాలకిషన్, గంగుల వెంకట రాజారెడ్డి లను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ, తాజా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను, తిరస్కారాలను వ్యక్తం చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ మండలమాజీ అధ్యక్షులు గంగుల వెంకట రాజా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సామాజిక ప్రజా సేవా కార్యక్రమాలను ఎవరూ అడ్డుకోలేరని, పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వారి వత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారని వారిని అర్థం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. వారిని అక్రమంగా వినియోగించుకుంటే వినియోగించుకున్న వారికే నష్టమన్నారు. వేదిక కావాలి అంటే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నెలకు రెండు మూడు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఓర్పు, సహనం విజయానికి, మార్పుకు, జ్ఞానం పొందడానికి సమాలోచన చేయడానికి ఉపయోగ పడుతుందని సరైన మార్గంలో చూపిస్తుంది అన్నారు. కేసులు కొత్త కాదని, భారత రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులను కనిపించిందని అవన్నీ తెలుసు అన్నారు. ప్రజలకు చేరువ వారికి మంచి చేయాలని, వారి గుండెల్లో నిలిచి పోవాలని ఆయన సూచించారు. పూస బాలకిషన్ మంచి వ్యక్తిత్వం సేవా దక్పథం ఉన్న నాయకుడని, అనేక సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటు ముందుకు సాగుతున్నరాన్నారు.ఈ కార్యక్రమంలో కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగం, నాయకులు శం బయ్య, సర్పంచ్ చిల్లర కైలాసం, ఎంపీటీసీలు మాడూరి జ్యోతి రామచంద్ర రావు, పూస బాలమణి బాల నరసింహ, మాజీ సర్పంచ్ ఆకారపు మధు బాబు, నాయకులు బత్తుల కష్ణ గౌడ్, మాజీ ఎంపీపీ మాధవరెడ్డి, జేల్లా వెంకటేష్, రామిని రమేష్, కోట సుధాకర్, ఎండి అక్రమ్, కునూరు కష్ణ గౌడ్, గంగుల వెంకట్ రెడ్డి, బాల్తు నాగయ్య, పిట్ట రామ్ రెడ్డి, రఘుమారెడ్డి, మందడి గోపాల్ రెడ్డి, జెట్టి శివప్రసాద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.