Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
నలుగురు రైతులతో పాటు ఎనిమిది మంది మతి చెందిన లఖింపూర్ ఖేరి సంఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ, కేంద్ర మంత్రి అజరు కుమార్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పట్టణ అధ్యక్షులు ఎండి జామీరోద్ధిన్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి ఏజాస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బర్ల స్వామి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు గురుకు శివ, అయ్యాడపు నర్సిరెడ్డి, గుండాల సతీష్, ఆవుల నర్సింహ్మ, మేకల మల్లయ్య, తోటకూరి అంజయ్య, మహిబూబ్ అలీ, నోముల దశరధ, యాదయ్య, గోవర్ధన్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.