Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని బండసోమారం గ్రామ సభ్యుడు రైతు సురుపంగ ఎల్లయ్య (50) , గౌస్‌నగర్ గ్రామానికి చెందిన రైతు గడసందుల సోమయ్య(57) మతి చెందగా, వారి కుటుంబ వారసులకు ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున మొత్తం పీఏసీఎస్ డివిడెండ్ నిధి నుండి అధ్యక్షులు మందడి.లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సీఈఓ నల్ల మాసు .రాములు , బ్యాంకు వైస్ చైర్మెన్ ఎలిమినేటి మల్లారెడ్డి , డైరెక్టర్లు భూర్గు. సౌజన్ , బ్యాంకు సిబ్బంది గుర్రం నాగరాజు, సంఘము సభ్యులు,రైతులు పాల్గొన్నారు.