Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నవంబర్ 15, 16, 17 తేదీల్లో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దండం పల్లి సత్తయ్య కోరారు. గురువారం దేవరకొండ రోడ్డులో మహాసభల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి ఐసోలేషన్ కేంద్రాలను, హెల్ప్‌లైన్ సెంటర్ల నడిపిన చరిత్ర సీపీఐ(ఎం)ది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు దండం పల్లి సరోజ, మారగోని నగేష్, శాఖ సభ్యులు ఎస్కే మహబూబ్ అలీ, పనస చంద్రయ్య, పెరిక కష్ణ ,ఓర్సు వెంకటేశ్వర్లు, బచ్చ గొని మల్లేష్, బొమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.