Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వేంల
రాష్ట్రంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం అన్యాయమని సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్చార్జి మాలోతు సైదానాయక్ అన్నారు. గురువారం మండలంలోని బీబీగూడెం గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సైదానాయక్ మాట్లాడుతూ జాతి మనుగడకు కృషి చేసే ఏకైక సంఘం సేవాలాల్ సేన అని పేర్కొన్నారు. వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం గడుపుతున్న గిరిజనుల భూములను లాక్కోవడం సరికాదన్నారు. అంతే కాకుండా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో దీర్ఘకాలంగా సాగుచేసుకుంటున్న గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవాధ్యక్షుడిగా ధరావత్ వీరన్న చందు నాయక్, అధ్యక్షుడిగా భూక్యా నాగునాయక్, ఉపాధ్యక్షులుగా జాటోతు కృష్ణనాయక్, రత్నావత్ నర్సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ ఖాసీంనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ధరావత్ సాగర్‌నాయక్, అధికార ప్రతినిధిగా బానోతు భికారునాయక్, కోశాధికారిగా ధరావత్ మల్సూర్ నాయక్, కార్యదర్శులుగా మూడ్ రవి నాయక్, సైదా నాయక్, హరీష్ నాయక్ ప్రచార కార్యదర్శులుగా ధరావత్ వాలు నాయక్, వెంకన్న నాయక్, నాయక్, లాలునాయక్, కార్యవర్గ సభ్యులుగా బానోతు హుస్సేన్‌నాయక్, భికోజినాయక్తో పాటు మరో నలుగురిని ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటుకు పరిశీలకులుగా రాష్ట్ర ఇన్చార్జి మాలోతు సైదా నాయక్, జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ శంకర్ నాయక్, బానోతు బాలు నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రాజేష్ నాయక్, సేవాలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఆర్ నాయక్ వ్యవహరించారు.
గిరిజన జాతి అభివద్ధి, హక్కుల కోసం పోరాడుతా
మండలాధ్యక్షుడు నాగు నాయక్
గిరిజన జాతి అభివృద్ధి, జాతి హక్కుల కోసం పోరాడుతానని మండలాధ్యక్షుడు భూక్యా నాగు నాయక్ అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ బిల్లు ఆమోదించాలన్నారు. తనపై గౌరవంతో ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ప్రకటించినం దుకు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్‌తో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువసేన అధ్యక్షులు హెచ్ఆర్.నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు పంతులు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాంనాయక్, జిల్లా అధికార ప్రతినిధి వెంకన్న నాయక్, జిల్లా కార్యదర్శి సేవ్యా నాయక్, నాయకులు రాజా నాయక్, తరుణ్ నాయక్, శేఖర్ నాయక్ సైదా నాయక్, దేవేందర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.