Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలంలోని జల్మాలకుంటతండా గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి కోసం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. అనంతరం ఆయన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి ఏయే రకాల మొక్కలు నాటారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత పల్లె ప్రకృతివనంలో మొక్క నాటారు. ఈ మేరకు గ్రామంలో ఉన్న అవసరాలను సర్పంచ్ రేచల్ నాగేందర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయదవ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నాతాల జానకీరాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్, యువజన విభాగం మండలాధ్యక్షులు శ్రీను, సర్పంచ్‌లు మామిడి వెంకన్న, సీతారాంరెడ్డి, నాయకులు నెమ్మాది కృష్ణ, మిరియాల వెంకటేశ్వర్లు, నల్లపు శ్రీను, ఇంద్రసేనారావు, సోమయ్య, దేవుల, మామిడి శోభన్, నకిరేకంటి సైదులు, యూత్ నాయకులు మామిడి నవీన్, శివారెడ్డి, అజిత్, తదితరులు పాల్గొన్నారు.