Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వేంల
సద్దుల బతుకమ్మ పండుగను గురువారం మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిమజ్జన సంబంధిత ప్రదేశాల్లో ఆయా గ్రామాల సర్పంచులు ఏర్పాట్లు చేశారు. మహిళలంతా రంగురంగుల పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మద్దిరాల : మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్దుల బతకమ్మ పండగను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో పెద్దపెద్ద బతుకమ్మలు పేర్చి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, మద్దిరాల గ్రామ సర్పంచ్ ఇంతీయజ్ ఖతూన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
అర్వపల్లి : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. బతుకమ్మలను రంగు రంగు పూలతో అలంకరించి పాటలు పాడుతూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, సర్పంచ్ బైరబోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.
పెన్పహాడ్:మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలందరూ ఒక చోట చేర్చి పాటలు పాడుతూ సంతోషంగా సద్దుల బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అనంతారం గ్రామంలో జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, లింగాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకురాలు గార్లపాటి స్వర్ణ శ్రీనివాసరెడ్డి, చీదేళ్ల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పరెడ్డి శోభావీరారెడ్డిలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్: తెలంగాణకు ప్రతీక బతుకమ్మ వేడుకలు అని ఆరెగూడెం సర్పంచ్ పులగం స్వాతి రాఘవరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఆరేగుడెం గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వారు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మహిళలు అందంగా తయారు చేసిన బతుకమ్మలకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుదొడ్డి మహేష్, అనిల్, ప్రవీణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.