Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
ఈ నెల 18న మండల కేంద్రంలోని ఎస్కేఎస్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొణతం చిన్న వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుందన్నారు. ఈ సమావేశానికి ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ అభివృద్ధిపై సమావేశంలో విస్తత స్థాయి చర్చ జరుగుతుందన్నారు. ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పాలకీడు మండల అధ్యక్షుడు సుబ్బారావు, పాలకవీడు ఎంపీపీ భూక్యా గోపాల్, జెడ్పీటీసీ బుజ్జి మోతీలాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి, నేరేడుచర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, నాయకులు కృష్ణమూర్తి, పాండునాయక్, సురేష్ రెడ్డి, జనార్ధన్‌చారి, రంగారెడ్డి, మాదాల వెంకట్, సైదులు, కుర్రి శ్రీను, సైదిరెడ్డి, నన్నెపంగ శ్రీను, ప్రవీణ్, అజరు, నవీన్, భాస్కర్, రాంరెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.