Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూర్
మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రజలు దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మోత్కూర్ పాత గ్రామపంచాయతీ సమీపంలో మున్సిపల్ చైర్మెన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి ఆధ్వర్యంలో దసరా పూజలు నిర్వహించారు. మండలంలోని అనాజీపురంలో జెడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి పూజలు నిర్వహించారు. మోత్కూర్‌లో బిక్కేరు వాగు వద్ద జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి జమ్మి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై జి.ఉదరుకిరణ్ సంప్రదాయ బద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. బంధువులు, స్నేహితులకు జమ్మి పెట్టి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మెన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, కారుపోతుల శిరీష, లెంకల సుజాత, ఎర్రవెల్లి మల్లమ్మ, దబ్బెటి విజయరమేష్, కూరెళ్ల కుమారస్వామి, గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి, మలిపెద్ది రజిత, వనం స్వామి, సర్పంచులు దండెబోయిన మల్లేష్, అండెం రజితరాజిరెడ్డి, వర్రె కవిత శ్రీను, ఉప్పల లక్ష్మీ, పేలపూడి మధు, ఎలుగు శోభసోమయ్య, మరిపెల్లి యాదయ్య, పైళ్ల విజయనర్సిరెడ్డి, రాంపాక నాగయ్య, బత్తిని తిరుమలేష్, ఎంపీటీసీలు రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి, ఆకవరం లక్ష్మణాచారి, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : విజయ దశమి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లోనూ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాంప్రసాద్, నవ్య, పద్మ, మహేందర్‌రెడ్డి, సమరసింహారెడ్డి, పాండరి, జయమ్మ, పద్మ, అనిత, లావణ్య, లక్ష్మి, శ్రీశైలం, సుజాత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
అర్వపల్లి : మండల ప్రజలు విజయదశమి వేడుకలను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోని శ్రీ సూర్య దేవాలయంలో ఆలయ నిర్వాహకులు కాకులు పూరి జనార్ధన్, ఆలయ అర్చకులు రామానుజాచార్యుల ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు, షమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తుంగతుర్తి : ధర్మ సంరక్షణ పోరాటంలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని తెలిపే పండుగ విజయదశమి అని, చెడు మీద మంచిని సాధించి విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు రామచంద్రారెడ్డి, మండలంలోని సర్పంచులు చందా వెంకన్న, గుగులోత్ వెంకన్న, ఏశమల్ల సుశీలసామెల్, మామిడి వెంకన్న, అబ్బగాని పద్మసత్యనారాయణ గౌడ్, గుగులోత్ ఈరోజి, ఎంపీటీసీలు కేతిరెడ్డి లతా విజరు కుమార్ రెడ్డి, మట్టపల్లి కవితా కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, జనసేన కార్యదర్శి మార్గం జితేందర్, ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : చెడుపై మంచి సాధించి విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని ఎల్లయ్య స్వామి ముదిరాజ్ అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెం గ్రామంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు కనకయ్య, శేఖర్, జానయ్య, అంజయ్య, సైదులు, లచ్చయ్య, నీలకంఠం, నాగరాజు, సైదులు, ఉపేందర్, మహేష్, తిరుమలేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : దసరా పండుగను పురస్కరించుకొని మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డుల్లోనూ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాజకీయ పక్షాల, కులసంఘాల, యువజన సంఘాల నాయకులు షమీ పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా శ్రీ కనకదుర్గ ఆలయానికి ఉదయం అయిదు గంటల నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ ప్రధానార్చకులు ఆలేటి రంగన్న, ఇతర అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మావారిని శ్రీ రాజరాజేశ్వరీగా అలంకరించారు. పండుగ సందర్భంగా చిన్నారులు బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ బతుకమ్మలు పేర్చిన మహిళలకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య బహుమతులు ప్రదానం చేశారు. మున్నూరు కాపు సంఘం కార్యాలయ ఆవరణలో జమ్మి చెట్టు వద్ద శమీపూజలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీ కనకదుర్గ ఆలయం ఎదుట రావణాసురుని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ పర్పరి శంకరయ్య, ఆలయ కమిటీ చైర్మెన్ కొలుపుల హరినాథ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి హాజరై రవాణాసురుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ గోపిశెట్టి నర్సయ్య, ఎస్సై ఎమడి.ఇద్రీస్‌అలీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
నేరేడుచర్ల : దసరా పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని విజయ దుర్గ ఆలయంలో శుక్రవారం శమీపూజ నిర్వహించారు. ఆలయ పూజారి ములుగు శ్రీనివాసాచార్యులు జమ్మిచెట్టుకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ కొణతం ఆదిరెడ్డి, కమిటీ సభ్యులు కొణతం చినవెంకట్‌రెడ్డి, నాగండ్ల శ్రీధర్, కొణతం సత్యనారాయణరెడ్డి, పాల్వాయి రమేష్, రాచకొండ రామన్న, కర్రీ సూర్యనారాయణరెడ్డి, కొణతం కృష్ణారెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు, గుర్రం మార్కండేయ, ఇంజామురి రాములు, బొడ్డుపల్లి సుందరయ్య, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : దసరా పండుగను పురస్కరించుకుని పలువురు పట్టణంలోని పలు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే.నగేష్, బూడిద భిక్షమయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, అరుణోదయ సాంస్కతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు విమల, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసుపరి శంకరయ్య, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా పార్టీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కుల, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం దసరా పండుగను మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జమ్మి చెట్టు వద్ద గ్రామ సర్పంచ్ ఇంతియాజ్ఖాతూన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు భక్తులు పూజలు అందుకున్న దుర్గామాతకు శోభాయాత్ర నిర్వహించి అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ. రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న, జెడ్పీటీసీ కన్న సురాంభవీరన్న, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్యా ల రవీందర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : విజయదశమి వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాయగిరి గ్రామంలోని శ్రీ ఆంజనేయ, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల వెంకట స్వామి యాదవ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పనా శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ ఎద్దునూరి ప్రేమలత, జక్కా కవిత రాఘవేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, మాజీ సింగిల్‌విండో చైర్మెన్ బల్గురీ మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్ లక్ష్మీ నరసింహారెడ్డి, సర్పంచ్ చిన్నం పాండు, ఎల్లముల శాలిని జంగయ్య యాదవ్, హనుమాపురం సర్పంచ్ ఎడ్ల రాజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహా, అనంతారం సర్పంచ్ చిందం మల్లికార్జున్, ఎంపీటీసీ సామల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ఎం : దసరా పండుగను మండల ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, జెడ్పీటీసీ కె.నరేందర్‌గుప్తా, వైస్ ఎంపీపీ బి.పద్మ పాపయ్య, పీఏసీఎస్ చైర్మెన్ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ పి.జ్యోతి, ఎస్సై మధు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బిసు చందర్‌గౌడ్, యాస లక్ష్మారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వేముల బిక్షం, సర్పంచులు జె నాగేష్, జి.మాధవిమల్లేశం గౌడ్, ఎస్.తిరుమల్ రెడ్డి, బి.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.