Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన దువ్వ చంద్రయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులను శనివారం సర్పంచ్ కనకటి సునీత వెంకన్న, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న పరామర్శించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం కుటుంబ సభ్యులకు క్వింటా బియ్యం, రూ.5000 నగదు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రయ్య కుటుంబానికి టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కి పరమేష్గౌడ్, దేవాలయ కమిటీ చైర్మెన్ కనకటి వెంకన్న, ఉపసర్పంచ్ మన్యం రమేష్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దింటి మధు తదితరులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన తండు మల్లమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. మతురాలి కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ మండల నాయకులు పన్నాల సైదిరెడ్డి శనివారం పరామర్శించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం రూ.5000 ఆర్ధిక సాయం అందజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మల్లమ్మ కుటుంబానికి టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జటంగి వెంకన్న, చేవగాని యాదగిరి, ఉగ్గిడి సత్తయ్య, జటంగి నాగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.