Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా జమ్మిచెట్టు అని, ఇది విజయానికి సంకేతమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరుకో.. జమ్మిచెట్టు.. గుడి గుడికో జమ్మిచెట్టు... కార్యక్రమంలో భాగంగా జమ్మిచెట్టు నాటి మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఊర్లల్లో జమ్మిచెట్టు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందా వెంకన్న, ఎంపీటీసీ కేతిరెడ్డి లతవిజరు కుమార్‌రెడ్డి, గ్రామనాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, బర్ల సోమన్న, కోతి యాకన్న, తాళ్లపల్లి యాకయ్య, అన్నేబోయిన యాకన్న, మహేష్, బాలగాని ప్రవీణ్, నాతి మురళి, అన్నేబోయిన ఉపేందర్, సురేష్, అశోక్, మహంకాళివెంకన్న, సాయిలు, శ్రీకాంత్, సతీష్‌శర్మ, శ్రీను, గ్రామప్రజలు పాల్గొన్నారు.