Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
మండలంలోని నెమలిపురి గ్రామశివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణపనులకు ఎమ్మెల్యే శానంపూడి శానంపూడి సైదిరెడ్డి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ పొందిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తన ప్రోద్బలంతో నియోజికవర్గానికి తీసు కొచ్చానన్నారు.ఈ క్రమంలో టీఎస్ఐఐసీ పెట్టుబడుల సర్వేలో భాగంగా మొదటగా మండలంలోని నెమలిపురి గ్రామశివారులో దసరా పండగ పురస్కరించుకొని కప ఆర్‌జిఆర్ ఆగ్రోగ్రేటర్స్ సంస్థ భూమి పూజ చేసిందన్నారు.ఈ సంస్థ లో 365 రోజులు పండ్లు, కూరగాయలు నిల్వ చేసుకొని వేరే ప్రాంతాలకు ఎగుమతులు చేసుకోవ చ్చన్నారు.ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 350 నుండి 400 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని, ఈ ఉద్యోగాలు తీసుకునే క్రమంలో స్థానిక యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు.చుట్టుపక్క గ్రామాల అభివద్ధికి తోడ్పడాలని తన సందేశంలో స్థానిక శాసనసభ్యులు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చావా ప్రసన్నను కోరారు. ఈ కార్యక్రమంలో నెమలిపురం సర్పంచ్ కొమ్ము గురువయ్య, ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, జెడ్పీటీసీ చింతరెడ్డి చంద్రకలసైదిరెడ్డి, వైస్‌ఎంపీపీ పొల్నేడి శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగాచారి, హుజూర్నగర్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మెన్ జక్కుల నాగేశ్వరావు, హుజూర్నగర్ గ్రంథాలయ చైర్మెన్ పిన్నాని సంపత్, నియోజకవర్గ నాయకులు గెల్లి రవి, ఐఆర్ఎస్ అధికారి పిన్నాని సందీప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధిర సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొమ్ము లక్ష్మీనారాయణ, మండల అధికారప్రతినిధి ఉసిరికాయల వెంకటేశ్వర్లు, చింతలపాలెం ఎంపీటీసీ తోడేటి మహత్యం, మండల యూత్ అధ్యక్షులు గుజ్జుల నర్సింహారెడ్డి, సోషల్ మీడియాఅధ్యక్షులు గులాం హుస్సేన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్మతీన్, నాయకులు అమీర్‌సాబ్, సుబ్బారావు, రమేష్, నర్సింహారావు, కాటయ్య, ప్రభాకర్, కార్తీక్,రంగారెడ్డి పాల్గొన్నారు.