Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భారత రత్న మాజీ రాష్ట్రపతి క్షిపణి పితామహుడు డాక్టర్ ఎపీజే అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి పురస్కరించుకొని శనివారం నల్లగొండ జిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకురాలు కంబాల శివలిలా నల్లగొండ మండలంలోని తోరగల్ గ్రామంలోఅయన చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడు పేద కుటుంబంలో పుట్టి అనేక బాధలను అనుభవించి దేశం గర్వించదగ్గ శాస్రతవేత్తగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ, శ్రీజ, గంగమ్మ, దుర్గశ్రీ, శైలజ, సునీత, అంజలి,శృతి, పూర్ణచంద్రారెడ్డి, అంజలి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : భారత రత్న ,మాజీ రాష్ట్రపతి, భారత క్షిపణి పితామహుడు అబ్దుల్ కలామ్ జయంతి నల్లగొండ జిల్లా హెల్పింగ్ హాండ్స్ కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలతో కొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త, హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మునీర్ మాట్లాడుతూ కడు పేదరికంలో పుట్టి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా పని చేశారన్నారు. అనంతరం ఉచిత వైద్య పరీక్ష శిబిరం డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యాదగిరి,శ్రీనివాస్‌రెడ్డి,పాపయ్య, సాయి, ముదేహ,పెరోజ, షాహేదా, శిరీష, షాహీర్, నవీన్, రోహిత్, శివ, నౌషీన్, కావ్య, భవాని, సైదమ్మ,రుబీనా, రుహీనా, శ్వేత పాల్గొన్నారు.
అనంతగిరి : మండలపరిధిలోని ఖానాపురం గ్రామంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు.బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెబోయిన అంజియాదవ్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.