Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యురాలు అనురాధ
నవతెలంగాణ-భువనగిరి
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఫుట్ పాత్ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బట్టిపల్లి అనురాధ కోరారు. ఆదివారం పట్టణంలోని రైతు బజార్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆమె ప్రారంభించి మాట్లాడారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించేవరకు డబ్బాలను తొలిగించొద్దని కోరారు. స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు దుకాణాలు తీయాలని బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. అభివద్ధి పేరుతో డబ్బాలు తొలగించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు. బీసీ సంఘం యువజన జిల్లా అధ్యక్షులు రావుల రాజు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య,వనం రాజు, ఫుట్పాత్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు బందెల ఎల్లయ్య, నాయకులు కష్ణ,ఆరేపల్లి బాలరాజు, ఎండీ జానీ, చంద్రగిరి అంజయ్య, లక్ష్మి, లింగాల శ్యామల,వెంకటేశం,దత్త సత్యమ్మ, కొత్త లక్ష్మయ్య పాల్గొన్నారు.