Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలిగొండ:మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తూ ఆదివారం ఉదయం బాలికను గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయం కాలనీలో గుగ్గిళ్ళ వినోద్, తల్లి కుమార్తె నాలుగేండ్ల వెన్నెల ఉదయాన్నే బయటకు ఆడుకోడానికి రాగా పందులు స్వైర విహారం చేస్తూ బాలికను గాయపరిచాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పట్టణంలో పందులు. కుక్కలు .కోతులు స్వైర విహారం చేస్తూ మనుషులను గాయపర్చుతున్నాయని వాటిని నిర్మూలించాలని ఈ నెల 2వ తేదీన గ్రామ సభలో స్థానిక సర్పంచ్, కార్యదర్శి పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సర్పంచ్ ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా స్పందించి వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
చెత్త తొలగింపు