Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సివిల్ కోర్టు జడ్జి తులసి దుర్గా రాణి
సంస్థాన్ నారాయణపురం:చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నేరాల సంఖ్య తగ్గించవచ్చని చౌటుప్పల్ సివిల్ కోర్టు జడ్జి తులసి దుర్గా దేవి అన్నారు. ఆదివారం ఆమె చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్యతో కలిసి మండలంలోని గుడిమల్కాపురం, అల్లం దేవి చెరువు, పల్లగట్టు తండా గ్రామపంచాయతీ లో చట్టలపై అవగాహనాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా నేరాలు ఎదుర్కొంటున్నారన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారికైనా శిక్షలు తప్పవన్నారు. ఈ సందర్భంగా జడ్జిని స్రర్పంచ్లు మన్నె పుష్పలత చిత్రసేన రెడ్డి, సురివి యాదయ్యా, విజయ కిషన్ నాయక్ ఉపసర్పంచ్ సుధా జైల్షింగ్నాయక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ధర్మ శంకర్ గుడి లక్ష్మి జక్కా గ్రామా పెద్దలు నాను దేవా చిన్న శ్రీను రవి బాల పాల్గొన్నారు.